ఈ ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న ఓ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood Hero Roshan :సెలబ్రిటీల పిల్లలు చిన్నప్పుడు దిగిన ఫోటోలు పెద్దయ్యాక వైరల్ అయితే గుర్తుపట్టడం కష్టం. సరిగ్గా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఓ చిన్న బాబు నుంచొని ఉన్నాడు. ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. అతడెవరో కాదు, నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్.

తాజాగా పెళ్లి సందడి సినిమా తో రోషన్ అలరించబోతున్నాడు. అప్పట్లో శ్రీకాంత్ కి బ్లాక్ బస్టర్ గా నిల్చిన పెళ్ళిసందడి మూవీని డైరెక్ట్ చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో ఇప్పుడు పెళ్ళిసందడి తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడికి సీక్వెల్ కాదని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.ఇప్పటికే విడుదలైన రోషన్ పెళ్ళిసందడి సినిమా పోస్టర్లు, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం విశేషం. దాంతో మహేష్ తో రోషన్ చిన్నప్పటి ఫోటో ముందుగానే వైరల్ గా మారింది. ఇక కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రాబోతున్న పెళ్ళిసందడిని మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి శ్రీకాంత్ కి పేరు తెచ్చిన పెళ్ళిసందడి రోషన్ విషయంలో ఎలా ఉంటోందో చూడాలి.