టూత్ పేస్ట్ లో ఉన్న ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…ఇది నిజం

Tooth paste beauty tips in Telugu : టూత్ పేస్ట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కేవలం పళ్లను శుభ్రం చేసుకోవడానికే కాకుండా చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

టూత్ పేస్ట్ లో ఉన్న ఉపయోగాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోవాలంటే టూత్ పేస్ట్ చాలా బాగా సహాయపడుతుంది అయితే టూత్ పేస్ట్ లో చాలా రంగులు ఉంటాయి, తెలుపురంగు టూత్ పేస్ట్ మాత్రమే ఉపయోగిస్తే మంచిది.

ఒక బౌల్ లో కొంచెం టూత్ పేస్ట్ కొంచెం తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తూ ఉంటే మొటిమలు,నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగిపోవాలంటే… టూత్ పేస్ట్ లో ఉప్పు వేసి బాగా కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి పావుగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముడతలు తొలగించడానికి కూడా సహాయపడుతుంది.