తులసి ఆకులను ఎలా తీసుకోవాలి.. మింగితే మంచిదా…నమిలి తింటే మంచిదా…?

Tulasi health benefits In telugu :తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తులసి మొక్క ను ఔషధ మొక్క గా పరిగణిస్తారు. అనేక రోగాలను నయం చేయడంలో తులసి దశాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన సమస్యలు శరీరంలో విషాలను బయటకు పంపడానికి ఇలా తులసి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది అయితే తులసి ఆకులను నమిలి తినాలా లేదా మింగలా అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.

తులసి ఆకులను నమిలి తినటం వల్ల దంతాల ఏనామిల్ పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తులసి ఆకుల లో పాదరసం. ఐరన్ ఎక్కువగా ఉండటం వలన తులసి ఆకులను నమిలి నప్పుడు అవి రెండూ ఎక్కువగా విడుదల అయ్యి పంటి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను తిన్నప్పుడు మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది

వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎటువంటి ప్రభావం ఉండదు. తులసిని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తులసి ఆకులతో సహా తాగేయాలి. లేదా తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి అప్పుడు తులసి లో ఉన్న ప్రయోజనాలు అన్ని మనకు అందుతాయి. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా తులసిని ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకోవాలి.