15 రోజులు ఈ టీ తాగితే Joint Pains,వెన్నునొప్పి,అధిక బరువు అన్ని మాయం అవుతాయి

jiont pains home remedies in telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మందులను ఎక్కువగా వాడుతూ ఉంటాం అలా కాకుండా సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి డాక్టర్ సూచనలు కూడా తప్పనిసరిగా పాటించాలి.

ఈ రోజుల్లో వచ్చే కీళ్ల నొప్పులు నడుం నొప్పి కొలెస్ట్రాల్ యూరిక్ యాసిడ్,అధిక బరువు వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ చిట్కా కోసం కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. వాము, కలోంజీ విత్తనాలు ఈ రెండింటిని ఈ చిట్కా కోసం ఉపయోగిస్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ వాము,పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన వాము కలోంజి విత్తనాలు తింటూ ఆ నీటిని తాగాలి.

మరోవిధంగా కూడా వీటిని తీసుకోవచ్చు ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి పావు స్పూను వాము విత్తనాలు, పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి వడగట్టి ఆ నీటిని తాగాలి. ఈ నీటిలో తేనె కూడా కలుపుకోవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.