Healthhealth tips in telugu

సీతాఫలం తింటున్నారా…మిస్ చేసుకుంటే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే…అసలు నమ్మలేరు

Custard Apple benefits in telugu :ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లో తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల ఈ సీజన్ లో దొరికే సీతాఫలం తింటే ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు.

వర్షాకాలం ప్రారంభమవగానే సీతాఫలాలు మార్కెట్లో కనబడతాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది.

అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు. అలాగే, జుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడే మహిళలు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుందని చెపుతున్నారు.
gas troble home remedies
ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగు పరుస్తుంది. ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయి వున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలని వైద్యులు చెపుతున్నారు.
blood
ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం గర్భస్రావాన్ని నివారిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.