అపెండిసైటిస్ నొప్పిని తగ్గించే ఆహారాలు…అసలు మిస్ కావద్దు

Home Remedies for Appendicitis : అపెండిసైటిస్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి భరించటం చాలా కష్టం. ఆ నొప్పి పెద్ద ప్రేగుల వరకు వ్యాపిస్తుంది. అపెండిక్స్ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే బ్రస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పొట్ట ఉదరంలో ప్రమాదరక గాయం ఏర్పడే అవకాశం ఉంది. అపెండిసైటిస్ సమస్య ఉన్న వారిలో మొదట పొట్ట ఉదరంలో కుడివైపు భాగంలో విపరీతమైన నొప్పి బాదిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది,
వాంతులు, డయోరియా వంటి సమస్యలు ఎదుర్కుంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన నొప్పిని తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఉదయం పరగడుపున ఒక పచ్చి వెల్లుల్లిని తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు మాత్రం పచ్చి వెల్లుల్లి తినకూడదు.

అపెండిసైటిస్ కారణంగా మలబద్దకం సమస్య వస్తుంది. అందువల్ల ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. బీన్స్,బీట్ రూట్, క్యారెట్, బ్రొకోలీ, బ్రౌన్రై స్, సన్ ఫ్లవన్ సీడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వంటి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటె అపెండిసైటిస్ కారణంగా వచ్చే లక్షణాలను తగ్గించుకోవచ్చు.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన అపెండిసైటిస్ కారణంగా వచ్చే నొప్పిని సమర్ధవంతంగా తగ్గిస్తుంది. అందువల్ల రోజులో మూడు సార్లు అల్లం టీ త్రాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం ఆయిల్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి మసాజ్ చేసిన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.