ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Tollywood heroine ravali :ఇటీవల ఒక వేడుకలో అలనాటి హీరోయిన్‌ రవళిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పైగా బాగా లావుగా మారిపోవడంతో గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌లు అతిధులుగా హాజరై,రావళిని చూసి షాకయ్యారు. తన అందం, అభినయంతో 90దశకంలో హీరోయిన్‌గా వెలుగొందిన రవళి ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకుంది అప్పట్లో తన క్యూట్‌ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు లావుగా,బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా అయింది.

‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకుంది. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నా అని కూడా చమత్కరించింది. ఇంతకీ ఆ వేడుక ఏమిటంటే, నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందడి’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని, అక్టోబర్‌ 10 న ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక చేసుకుంది. దీనికి చిరంజీవి, వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. గౌరి రోనంకి ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించాడు.

అలాగే పాతికేళ్ల క్రితం శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా వచ్చారు.చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. ఎందుకంటే, నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశా. అయినా రాఘవేంద్ర రావు పిలిస్తే,ఏ స్టేజ్‌లో, ఎలా ఉన్నా వస్తాను. అందుకే వచ్చాను ’ అంటూ రవళి చెప్పింది.