ఈ నూనె వాడితే చాలు మోకాళ్ళ నొప్పులు చిటికెలో మాయం

joint pains home remedies in telugu :ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటున్నారు చిన్న వయసులోనే ఈ విధంగా నొప్పులు రావటం వలన నొప్పులు తగ్గించుకోవటానికి మంచి చిట్కాల కోసం చూస్తూ వాటిని పాటిస్తూ నొప్పి నుండి ఉపశమనం పొందుతున్నారు. .

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం రావాలి అంటే మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ నూనె అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పొయ్యిమీద ఒక ఐరన్ పాన్ పెట్టి దానిలో ఒక కప్పు ఆవనూనె పోయాలి దానిలో తొక్క వలిచిన 5 వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లం ముక్క ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వాము ఒక ఇంచ్ దాల్చిన చెక్క ముక్క ఐదు లవంగాలు వేసి ముదురు రంగు వచ్చే వరకు కలుపుతూ వేగించాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి రాత్రంతా అలా వదిలేయాలి

మరుసటి రోజు ఉదయం ఈ నూనెను వడగట్టి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి నిదానంగా మసాజ్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి ఈ విధంగా చేయడం వలన గ్యాస్ తగ్గి ఎముకల మధ్య గుజ్జు పెరిగి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ఒకసారి తయారు చేసిన నూనెను మూడు రోజుల వరకు వాడవచ్చు.