వెండి నెమలి ఇంట్లో ఉంటె ఏమి అవుతుందో తెలుసా ?

Silver Peacock :మనవాళ్లకు సెంటిమెంట్స్, జాతకాల పిచ్చి ఎక్కువే. పైకి ఎన్ని చెప్పినా అన్నీ ముహుర్తాలు చూసుకునే చేస్తారు. ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటె మంచిదో కూడా చెబుతూ ఉంటారు. అందులో నెమలి ఫించం గురించి ఎక్కువగా వింటుంటాం. చాలామంది ఇళ్లల్లోనే కాదు, పుస్తకాలలో కూడా పెట్టుకుంటారు.

అయితే వెండితో చేసిన నెమలి విగ్రహం కూడా కొందరి ఇళ్లల్లో దర్శనమిస్తుంది. కుమారస్వామి వాహనమైన నెమలిని వెండితో చేయించి సుబ్రహ్మణ్యేశ్వర గుళ్లకు విరాళంగా అందించేవాళ్ళు ఉన్నారు. కొన్ని ఆలయాల్లో ఇలాంటి ఘటనలు కన్పిస్తూ ఉంటాయి.

అయితే వెండి నెమలిని ఇంట్లో పెట్టుకుంటే మంచిదా కదా అంటే, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతుంటే, వెండి నెమలి విగ్రహాన్ని ఆగ్నేయ దిశగా పెడితే మంచిదని కొందరి పండితుల ఉవాచ. ఇంట్లో భార్యా భర్తల నడుమ, కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు కూడా వెండి నెమలిని ఇంట్లో పెట్టుకోవడం వలన తొలగిపోతాయని అంటున్నారు.