Healthhealth tips in telugu

ఈ గింజలను ఇలా తీసుకుంటే దగ్గు,జలుబు,గొంతు నొప్పి నిమిషంలో మాయం

Sabja Benefits in telugu :వాతావరణం మారింది. వానలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జలుబు,దగ్గు వచ్చాయంటే కరోనా వచ్చిందేమో అని తెగ కంగారు పడిపోవటమే కాకుండా చాలా భయపడిపోతున్నారు. దగ్గు,జలుబు వచ్చాయంటే కరోనా వచ్చినట్టు కాదు. సీజన్ మారి వానలు పడుతున్నాయి. వానలు వచ్చాయంటే కామన్ గా దగ్గు,జలుబు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడిన ఒక పట్టాన తగ్గవు. అయితే సబ్జా గింజలతో సులువుగా తగ్గించుకోవచ్చు. స‌బ్జా ద‌గ్గు,జ‌లుబును త‌గ్గించ‌డ‌మే కాదు.

గొంతులో మంట,ఆస్తమా,తీవ్రమైన జ్వరం, తలనొప్పి వంటి స‌మ‌స్య‌లను కూడా త‌గ్గిస్తుంది. అయితే సబ్జా ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను ఒక గ్లాస్ నీటిలో మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ సబ్జా నీటిలో కొద్దిగా తేనె, అల్లం ర‌సం కలిపి త్రాగాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు తాగితే దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ సబ్జా నీటిని ఉదయం ప్రతి రోజు తాగితే ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు,డయబెటిస్,రక్తపోటు అన్నీ నియంత్రణలో ఉంటాయి. సబ్జా గింజలు అందరికీ అందుబాటు ధరలోనే ఉండటమే కాకుండా విరివిగా సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి. ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.