ఇలా చేస్తే 3 రోజుల్లో ముఖం మీద ముడతలు,మచ్చలు అన్నీ మాయం అయ్యి యవ్వనంగా ఉంటారు

Home remedies for wrinkles In Telugu : ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు అధికంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే .రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు అలాగే వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ముడతలను తగ్గించుకోవచ్చు.

ఈ రెమిడీ కోసం జీలకర్రని ఉపయోగిస్తున్నాం.జీలకర్రను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.జీలకర్రలో పొటాషియం సెలీనియం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు ముడతలు లేకుండా ముఖం యవ్వనంగా ఉండేలా చేస్తుంది

ఒక బౌల్ లో ఒక స్పూన్ జీలకర్ర పొడి అరస్పూన్ అలోవెరా జెల్ అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి పావుగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముడతలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది