Healthhealth tips in telugu

డయబెటిస్ ఉన్నవారు బెల్లం తింటే ఏమి అవుతుంది…?

Diabetes unnavaru bellam thinavacha : బెల్లంలో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు చిన్న బెల్లం ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. మనలో చాలా మంది భోజనం అయ్యాక చిన్న బెల్లం ముక్కను తింటూ ఉంటారు. అలా తినటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుందని ఒక నమ్మకం. ఆ నమ్మకం కూడా నిజమే.

అయితే డయబెటిస్ ఉన్నవారు పంచదారకు బదులుగా బెల్లం వాడవచ్చా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. పంచదార, బెల్లం.. రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి. వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి. రెండింటి గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా ఎక్కువే.

కానీ పంచదారను శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు. అందువల్ల బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి. కనుక ఆరోగ్యం పరంగా పోలిస్తే పంచదార కన్నా బెల్లమే మంచిదని చెప్పవచ్చు.

ఇక డయాబెటిస్‌ ఉన్నవారు పంచదారకు బదులుగా బెల్లంను వాడుకోవచ్చు. కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువైతే బెల్లం కూడా సమస్యలను కలగజేస్తుంది. కనుక డయాబెటిస్‌ ఉన్నవారు పంచదారకు బదులుగా బెల్లంను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.

ఇక ముదురు గోధుమ రంగులో ఉండే బెల్లం మంచిది. అత్యంత సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేస్తే బెల్లంకు ఈ రంగు వస్తుంది. కనుక దాన్ని తీసుకోవాలి. మిగిలిన ఏ రంగులో ఉండే బెల్లంను అయినా తినకూడదు. వాటిల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.

ఏదైనా మోతాదు మించితే అనర్ధమే. కాబట్టి సరైన మోతాదులో తీసుకుంటే వాటిల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.