Healthhealth tips in telugu

పరగడుపున వెల్లుల్లి+తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Honey and garlic benefits in Telugu : వెల్లుల్లి, తేనె రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అదే వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లి, తేనె మిశ్రమం ఎలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో చూద్దాం.
Garlic side effects in telugu
ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున అసలు తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యిన అరగంట తర్వాత తీసుకోవచ్చు. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దీని వల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపు దిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.
Garlic Benefits in telugu
ప్రధానంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది.పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.
gas troble home remedies
జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి.డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి.శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.

తయారీవిధానం:-
ఓ చిన్నపాటి జార్‌ను తీసుకుని అందులో సగం వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రేకుల్ని నింపాలి.తరువాత ఆ వెల్లుల్లి రేకులు మునిగిపోయే వరకు అందులో తేనె పోయాలి. ఆ తరువాత జార్‌కు మూత పెట్టి పొడి వాతావరణంలో 2 వారాల పాటు అలాగే ఉంచాలి. రెండు రోజులకు ఒకసారి జార్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని కలపాలి.2 వారాల అనంతరం ఆ మిశ్రమాన్ని వాడుకోవాలి.నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమాన్ని సేవించాలి.ఇలా తీసుకోవడం వల్ల కలిగే కలిగే ఫలితాలు మీరు వారం రోజులకే పొందుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.