మెగాస్టార్ “మృగరాజు” సినిమాలో సింహం కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్

chiranjeevi mrugaraju movie :అగ్ర హీరోలతో సినిమాలంటే బడ్జెట్ ఎక్కువే పెట్టాలి. హంగూ ఆర్భాటాలు ఉండాలి. సెట్స్ కి భారీగా ఖర్చుపెట్టాలి. లుక్స్ అదిరిపోవాలి. ఇక సాంగ్స్, ఫైట్స్ సరేసరి. ఇంతా ఖర్చు పెట్టాక ఆ సినిమా డిజాస్టర్ అయిందంటే ఇక ప్రొడ్యూసర్ పని అయిపోయినట్లే. సినిమా అంటేనే రిస్క్ కదా. ఇక వరుస విజయాలతో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసిన మృగరాజు మూవీ దారుణంగా ప్లాప్ అయింది.

ఇద్దరు హీరోయిన్స్ లో సోనాలి బింద్రే ను హీరోయిన్ గా అనుకుంటే కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో సిమ్రాన్, సంఘవి నటించిన ఈ మూవీని అడవి బ్యాక్ డ్రాప్ తో గుణశేఖర్ తెరకెక్కించారు. నాగబాబు కీలక పాత్ర పోషించాడు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో సింహం కోసమే చాలా ఖర్చు పెట్టారట. చిరంజీవితో దాదాపు ఆరు హిట్ మూవీస్ తీసిన కె దేవి వరప్రసాద్ నిర్మించారు.

హాలీవుడ్ లో నటించిన జాక్ సింహం ఈ మూవీ కోసం రప్పించారు. సింహం చిరంజీవి నడుమ దాదాపు 26రోజులు షూటింగ్ చేసారు. చిరంజీవి అయితే రోజుకి 20గంటలపాటు కష్టపడ్డారు. ఏకంగా 150రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి డేట్స్ ఇచ్చి నటించారు. చాయ్ వాలా సాంగ్ ఆకట్టుకున్నా, సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇందులో సింహం కోసం దాదాపు 67లక్షలు వెచ్చించారట.