పింగాణీ కప్పుల్లో టీ, కాఫీ, పాలు తాగుతున్నారా…అయితే ఈ నిజాలు తెలుసుకోండి

ceramic cup Side effects In telugu : మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ లేదా పాలను తాగుతూ ఉంటారు. అయితే చాలామంది సిరామిక్ కప్పులో తాగుతూ ఉంటారు. ఇలా కప్పులలో తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో రకరకాల రంగులతో చాలా ఆకర్షణీయమైన కప్పులు కనిపిస్తూ ఉంటాయి.

వాటిని మనం కొనుగోలు చేసి కాఫీ తాగుతూ ఉంటాం. ఈ కప్పులలో వేడి ద్రవాలను పోసినప్పుడు వాటిలో ఉండే తగరం,సీసం ఆ ద్రవాల్లో కరుగుతాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. సిరామిక్ పాత్రల తయారీలో తగరం., సీసం వంటివి ఉపయోగిస్తారు

ఈ కప్పులలో కాఫీ లేదా పాలు తాగినప్పుడు పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అయితే అన్ని పింగాణీ పాత్రలు, కప్పులు హానికరం కాదు

బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సిరామిక్ కప్పులను వాడితే పెద్దగా దుష్ప్రభావం ఉండదని నాసిరకం కప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని…అందువల్ల హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.