మెగాస్టార్ సినిమాలో నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్…?

Chiranjeevi New Movie :కొన్ని పాత్రలు చేయడానికి ఒక్కోసారి ఫలానా తారే కావాలనుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంతా చెల్లించుకోక తప్పదు. అందునా స్టార్ హీరోయిన్ గా పలు భాషల్లో సత్తా చాటుతున్న నయనతార విషయంలో ఇక చెప్పక్కర్లేదు. హీరోయిన్ గా ఎంత డిమాండ్ చేసిందో, మిగిలిన పాత్రలకు అలానే డిమాండ్ చేస్తోందని అంటున్నారు.

ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయ్యారు. చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో నయనతార హీరోయిన్ గా చేసింది. అప్పుడు ఎక్కువ మొత్తమే ఆమె డిమాండ్ చేయడంతో ఆమేరకు చెల్లించినట్లు వార్తలొచ్చాయి.

తాజాగా మలయాళ మూవీకి రీమేక్ గా తీస్తున్న గాడ్ ఫాథర్ మూవీ లో చిరంజీవి సిస్టర్ గా నయనతారను ఒప్పించారు. ఈమేరకు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇందులో నటించడానికి ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేయగా, ఆమేరకు చెక్కు ఇచ్చేశారట. సౌత్ లో పూజా హెగ్డే, రష్మిక మందన టాప్ హీరోయిన్స్ గా ఉంటూ రెండు మూడు కోట్లు అందుకుంటుంటే, నయన్ ఇంత పెద్దమొత్తం డిమాండ్ చేయడం విశేషమని అంటున్నారు.