MoviesTollywood news in telugu

తరుణ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Nuvve kavali movie heroine richa : తెలుగులో నువ్వే కావాలి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి. లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన ఈ మూవీలో రిచా పల్లోడ్ హీరోయిన్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. తొలి సినిమాతోనే తరుణ్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన నువ్వే కావాలి మూవీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైలాగ్స్‌తో ఈ మూవీని బ్లాక్ బస్టర్ దిశగా నడిపించడంలో దోహదపడ్డాయి.
Nuvve Kavali Movie
ఇక హీరోయిన్ రిచా వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులో పుట్టి, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూనే, 2011లో హిమాన్షు బజాజ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది. 2013లో బాబు పుట్టాడు. అయితే 2016లో మలుపు మూవీ తర్వాత మూవీస్ చేయలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది.

బ్లాక్ బస్టర్ మూవీ నువ్వే కావాలి మూవీ వచ్చి 20 ఏళ్లు దాటినా, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగానే ఉంది. ఈ సినిమాలో ఉత్తమ నటిగా రిచాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. కానీ తర్వాత అనుకున్న స్థాయిలో ఈమెకు టాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కలేదు. కొన్ని ఆమె తెలుగు సినిమాలు చేసినా ఆశించిన ఇమేజ్ రాలేదు.