ఉదయం పరగడుపున ఈ అన్నం తింటున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Chaddannam Health Benefits in Telugu : మన శరీరంలో మంచి బ్యాక్టీరియా,చెడు బ్యాక్టీరియా అనే రెండు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా మనకు చెడు చేస్తుంది. మంచి బ్యాక్టీరియా మనకు మేలు చేస్తుంది. మన శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవాలి.

మన శరీరంలో విటమిన్ డి ,B12 అనేవి మనం తీసుకునే ఆహారం నుండి మన శరీరం బాగా శోషించు కోవాలి అంటే మంచి బ్యాక్టీరియా అవసరం. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా మార్చే సెరొటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి కూడా మంచి బ్యాక్టీరియా అవసరం అవుతుంది.

మంచి బ్యాక్టీరియా అనేది పులియబెట్టిన వాటిలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ని ప్రోబయోటిక్స్ అంటారు. పుల్లని మజ్జిగ., పెరుగు, 2 రోజుల పాటు నిలవ ఉంచిన పచ్చళ్ళు, బాగా పండిన అరటిపళ్ళు, జున్ను వంటి వాటిలో ప్రోబయోటిక్స్ లభిస్తాయి.

మన శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ అందాలి అంటే ఒక మంచి మార్గం ఉంది. రాత్రిపూట అన్నంలో పాలు పోసి తోడు పెట్టి అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఈ అన్నాన్ని తినాలి. ఈ అన్నాన్ని పరగడుపున తింటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.

మంచి బ్యాక్టీరియా శరీరంలో పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అల్సర్లు, జీర్ణాశయం, పేగులో పుండ్లు ఉన్నవారు, గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నవారు, విటమిన్స్ లోపం ఉన్నవారు ప్రతిరోజు ఈ అన్నాన్ని తింటే ఆ సమస్యల నుంచి బయటపడతారు.

ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగటం, పొగ తాగటం, మద్యం సేవించడం, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకోవటం, యాంటీబయాటిక్స్ లేదా PainKillers ఎక్కువగా వాడటం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం… వంటి వాటి వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. కాబట్టి ఈ పనులు చేయకుండా జాగ్రత్తపడాలి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఈ అన్నం తిని మంచి బ్యాక్టీరియాను పెంచుకోండి. ఈ అన్నంలో రుచి కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి నలుచుకొని తినవచ్చు.