Devotional

గుమ్మాలకు నిమ్మకాయ, మిర్చి కట్టడం వెనుక రహస్యం ఇదే

Hang nimbu mirchi to the main door : ఇదైనా కొత్త బైక్ కొనుక్కుంటే నిమ్మకాయలు కట్టడం మనలో చాలామందికి అలవాటు. ఏ అమ్మవారు గుడికో బైక్ ని తీసుకెళ్లి పూజ జరిపించి నిమ్మకాయలు కడతారు. ఇలా మన సంప్రదాయంలో, సెంటిమెంట్స్ … ఆచారాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అలాగే గుమ్మానికి నిమ్మకాయలతో పాటు మిర్చి కూడా కల్పి కట్టడం చూస్తుంటాం.

కొందరు ప్రతివారం కొత్తగా ఇలా నిమ్మకాయలు, మిర్చి దారానికి గుచ్చి గుమ్మానికి అటూ ఇటూ గానీ, మధ్యలో గానీ కట్టడం చూస్తుంటాం. అయితే ఇలాంటి నమ్మకాలతో సైన్టిఫిక్ రీజన్ కూడా ఉందని అంటారు. గుమ్మానికి ఇలా నిమ్మకాయలు, మిర్చి కట్టడం వలన రాత్రి వేళలలో కరెంట్ పొతే, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని అంటారు.

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, మిరపకాయలో విటమిన్స్ ఇలా క్రిమికీటకాలను అడ్డుకుంటామని కొందరు చెప్పేమాట. అయితే ఇంటికి దిష్టి తగలకుండా, గాలీ ధూళీ సోకకుండా ఉండేందుకు ఇలా నిమ్మకాయలు, మిరపకాయలు గుచ్చి కడతారని కూడా చెబుతారు. మొత్తానికి సెంటిమెంట్ తో పాటు శాస్త్రీయత కూడా జోడించి ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ ముడిపెట్టారు మన పూర్వికులు.