Healthhealth tips in telugu

Sesame Seeds Benefits: పరగడుపున రోజు 1 స్పూన్ గింజలను నానబెట్టి తింటే ఊహించని ప్రయోజనాలు

sesame seeds health benefits in telugu : నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అనే రెండు రకాలు ఉన్నాయి. నువ్వులతో నువ్వుల పొడి, నువ్వుల ఉండలు వంటివి చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటాయి. ఆయుర్వేదంలో నువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నువ్వులలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచి సువాసనను కలిగి ఉంటాయి మరియు తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో కాల్షియం 60% సమృద్దిగా ఉంటుంది.

నువ్వులలో మెగ్నీషియం సమృద్దిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణ, డయబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు తొలగిపోయి పేగుల్లోని వ్యర్థ పదార్థాలు సక్రమంగా బయటకు వెళ్లిపోతాయి. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది .

నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన ధమనులలో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.

తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత నుండి త్వరగా బయటపడాలంటే రోజూ ఒక స్పూన్ నల్ల నువ్వులను తీసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పుల సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అలాంటి వారికి నువ్వులు చాలా బాగా సహాయపడతాయి. నువ్వులలో ఉండే కాపర్ కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఎముకలు, కీళ్లు మరియు రక్తనాళాలను బలోపేతం చేస్తుంది.

నువ్వులలో కాల్షియం చాలా సమృద్దిగా ఉంటుంది. నువ్వులలో ఉండే జింక్ ఎముకల సాంద్రతను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి, రోజూ కనీసం ఒక స్పూన్ నువ్వులను తినండి. ప్రతి రోజు ఒక స్పూన్ తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను నములుతూ ఆ నీటిని తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.