Healthhealth tips in telugu

పెయిన్ కిల్లర్ ఆకు…ఈ ఆకులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

Tamalapaku Health benefits In telugu :ఆకులలో ముఖ్యమైన ఆకు అయిన తమలపాకు గురించి మనకు తెలుసు. తమలపాకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలంగా స్వీకరిస్తాం. ఇక ఇందులో ఎన్నో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్ యాంటీఆక్సిడెంట్‌ సమృద్దిగా ఉంటాయి.

తమలపాకు తలనొప్పి, మైగ్రైన్ తలనొప్పి, మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషదము అని చెప్పవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు తమలపాకు ఆకులను పేస్ట్ గా చేసి నుదురుకు రాసి అరగంట అరనివ్వాలి. అప్పుడు తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడి తగ్గి నరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా మెదడు మీద ఒత్తిడి తగ్గుతుంది. దాంతో తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అలాగే కీళ్లనొప్పులు ఉన్నప్రదేశంలో కూడా ఈ పేస్ట్ రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అందుకే తమలపాకును పెయిన్ కిల్లర్ ఆకు అని చెప్పవచ్చు. నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొనవసరం లేదు. ఇలా ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.

ప్రతి రోజు లేత తమలపాకు ఒకటి తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఆకుకూరల్లో ఏ విధంగా ఫైబర్ సమృద్దిగా ఉంటుందో అలాగే తమలపాకులో కూడా ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది.

జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు భోజనం అయ్యాక ఒక చిన్న తమలపాకు తింటే సరిపోతుంది. అలాగే ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.