రోజుకి ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే చాలు…నరాల బలహీనత,డయబెటిస్,రక్తపోటు అనేవి జీవితంలో ఉండవు
Sun Flower Seeds Health benefits In telugu : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ అనేది ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుంది. శారీరకశ్రమ తక్కువగా ఉండడం, జీవన విధానంలో మార్పులు, ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటి సమస్యల కారణంగా డయాబెటిస్ అనేది వస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది.
డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని ఆహారాలను భాగంగా చేసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచటానికి సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా బాగా సహాయపడుతాయి వీటినే పొద్దుతిరుగుడు విత్తనాలు అని కూడా అంటారు.
ఈ గింజలలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, మోనోసాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తింటే డయబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా నరాల బలహీనత,రక్తపోటు అనేవి కూడా నియంత్రణలో ఉంటాయి.
డయబెటిస్ వచ్చిందంటే నరాల బలహీనత,రక్తపోటు అనేవి కూడా చాలా త్వరగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తీసుకుంటే మంచి పోషకాలు మన శరీరానికి అంది ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన నియంత్రణలో ఉంటాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్ ని వెగించి తినవచ్చు లేదా నానబెట్టి తినవచ్చు లేదా నేరుగా అలాగే తినవచ్చు. గింజలను 5 లేదా 6 గంటలు నానబెట్టాలి. నానిన గింజలను తింటూ ఆ నీటిని తాగాలి.