Healthhealth tips in teluguKitchen

తమలపాకుతో తేనె కలిపి తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Betel leaf And Honey Health benefits in telugu : ఆకులలో ముఖ్యమైన ఆకు తమలపాకు. ఈ ఆకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలంగా స్వీకరిస్తాం. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌ సమృద్దిగా ఉంటాయి. తేనె, తమలపాకు కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

తేనె,తమలపాకు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. దగ్గు,జలుబు,గొంతు నొప్పి ఉన్నప్పుడు తేనె,తమలపాకు కలిపి తీసుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. ఒక తమలపాకు మీద అరస్పూన్ తేనె వేసుకొని తినవచ్చు. లేదా తమలపాకు రసంలో తేనె కలుపుకొని తాగవచ్చు.
gas troble home remedies
పిల్లల్లో అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ప్రస్తుతం వానలు వస్తున్నాయి. ఈ సమయంలో తమలపాకు,తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది.
Joint Pains
కండరాల ఒత్తిని తగ్గించటమే కాకుండా కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తమలపాకు,తేనె కలిపి తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.