Healthhealth tips in telugu

chickpeas Benefits:బాదం పప్పు కంటే బలమైన, తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటి అసలు సంగతి తెలిస్తే …

chickpeas Benefits In Telugu : ఫాబేసి కుటుంబానికి చెందిన శనగలలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనగలను పేదవాని బాదం అని కూడా అంటారు. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలోని చక్కెరస్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా మెరుగ్గా నియంత్రించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే చాలా మంచిది. శనగల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎముకలకు సంబందించిన ఎటువంటి సమస్యలు రాకుండా చేస్తుంది. కాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

శనగల్లో ఉండే విటమిన్ బి9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి సహాయపడుతుంది. అలసట,నీరసం,నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏమి ఉండవు. చెడు కొలస్ట్రాల్ తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.

దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఏమి రావు. శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటివి.. మంచి నిద్రను అందిస్తాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లకు శనగలు మంచి ఆప్షన్.శనగల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి.. వీటి ద్వారా తేలికగా అనీమియా నివారించవచ్చు.

శనగల్లో ఐరన్, ప్రొటీన్, మినరల్స్ ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. అలాగే శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. మిమ్మల్ని స్ట్రాంగ్ గా మార్చి.. ఎల్లప్పుడు ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడతాయి.శనగల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి.. పాలతో సమానం. అందువల్ల శనగలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.