Healthhealth tips in telugu

కేవలం అర గ్లాస్ 10 రోజుల్లో స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్

Green Tea Weight Loss Tips In Telugu : మారిన జీవనశైలి కారణం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువు, శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి ఒక డ్రింక్ తయారీ తెలుసుకుందాం.
Green Tea Benefits In telugu
ఈ డ్రింక్ కోసం కేవలం నిమ్మరసం, గ్రీన్ టీ ఉపయోగిస్తున్నాం. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి బాగా మరిగాక అరస్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి గిన్నె మీద మూత పెట్టి 10 నిమిషాలు అయ్యాక ఆ నీటిని వడకట్టి దానిలో అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి.

గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ డ్రింక్ ని పరగడుపున తాగకూడదు. గ్యాస్ సమస్య లేనివారు తాగవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పావుగంట గ్యాప్ ఇచ్చి ఈ డ్రింక్ తాగవచ్చు. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. రోజు అరగ్లాస్ మోతాదులో తాగితే సరిపోతుంది.

Green Tea లో ఉండే EGCG అనే పదార్థం మీ జీవక్రియ రేటు పెంచి అదనంగా ఉండే కొవ్వును కరిగిస్తుంది అంతేకాదు Green tea మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొవ్వును వేగంగా కరిగించటానికి సహాయపడుతుంది. తేనె కూడా బరువును తగ్గించటానికి సహాయపడుతుంది.