Healthhealth tips in telugu

పరగడుపున నానబెట్టిన వీటిని తింటే ఆ సమస్యలు మాయం.. ఏమిటో తెలుసా?

Soaked almonds and raisins Benefits In Telugu : బిజీ జీవనశైలిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులు, నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

రాత్రి సమయంలో నాలుగు బాదం పప్పులు, 8 నల్ల ఎండు ద్రాక్ష నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున బాదం పప్పులను తొక్క తీసి తినాలి .ఆ నీటిని తాగుతూ నల్ల ఎండు ద్రాక్ష కూడా తినాలి. ఈ విధంగా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

వీటిని నానబెట్టి తినడం వలన పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటిలోని పోషకాలు జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఉదయం పరగడుపున తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. బాదం మరియు నల్ల ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు మరియు చర్మానికి మేలు చేస్తాయి.

ఉదయం సమయంలో తినటం వలన రోజంతా నీరసం, నిసత్తువ లేకుండా ఉషారుగా ఉంటారు. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల కొవ్వు జీర్ణం కావడానికి కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య ఉండదు. కాబట్టి ప్రతి రోజు బాదంపప్పు, నల్ల ఎండు ద్రాక్ష తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.