ఆ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తింటే ఏమి అవుతుందో తెలుసా?

cashew nuts Side effects in telugu :జీడిపప్పు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటి వలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే నిపుణులు పరగడుపున తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

కొన్ని సమస్యలు ఉన్నవారు కూడా జీడిపప్పుకు దూరంగా ఉంటేనే మంచిదని అంటున్నారు. జీడిపప్పులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు జీడిపప్పును ఎక్కువగా తినకూడదు.

ఎందుకంటే జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా పరగడుపున జీడిపప్పు తినకూడదు. ఒకవేళ తింటే జీడిపప్పులో అధికంగా ఉన్న ఫైబర్ గ్యాస్ సమస్యలను పెంచుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవృ కూడా తినకూడదు. దీనిలో ఉండే పొటాషియం కిడ్నీ సమస్యలను పెంచుతుంది.

అయితే రోజులో ఎన్ని జీడిపప్పులు తినవచ్చు అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణంగా రోజుకు 4 నుంచి 5 జీడిపప్పులను తినవచ్చు. కానీ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే నిపుణుల సలహా మేరకు జీడిపప్పు తీసుకోవడం చాలా మంచిది.