Healthhealth tips in telugu

3 సార్లు… ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు జీవితంలో గుండెపోటు అనేది రాదు

cholesterol reduce drink In Telugu : శరీరంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే గుండెకు సంబందించిన సమస్యలు వస్తాయి. కాబట్టి కొలస్ట్రాల్‌ ని తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే రెమిడీని ఫాలో అయితే తొందరగా కొలస్ట్రాల్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం.
Honey benefits in telugu
ఈ డ్రింక్ తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ డ్రింక్ తయారీ కోసం అల్లం,వెల్లుల్లి, నిమ్మకాయ, దాల్చిన చెక్క, తేనె ఉపయోగిస్తున్నాం. తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది. రోజులో ఒకసారి అరగ్లాస్ తీసుకుంటే సరిపోతుంది.

దీని కోసం పొయ్యి వెలిగించి ఒక గ్లాస్ నీటిని పోసి నిమ్మకాయను సగానికి కట్ చేసి సగం ముక్కను నాలుగు బాగాలుగా చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 2 రెబ్బల వెల్లుల్లిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ డ్రింక్ ని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.