Healthhealth tips in telugu

పరగడుపున ఒక స్పూన్ తింటే…100 ఏళ్ళు వచ్చిన కాల్షియం లోపం లేకుండా ఎముకలు బలంగా ఉంటాయి

sesame seeds Health Benefits In telugu : తెల్ల నువ్వులలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను తింటూ ఆ నీటిని తాగాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రావటం అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

నువ్వులలో ఉండే జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ వంటివి శరీరంలో కాల్షియం లోపం మరియు ఐరన్ లోపం లేకుండా చేస్తాయి. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. నువ్వులలో బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది.

తెల్ల నువ్వుల నుండి నూనెను తీయగా మిగిలిన పిప్పిని తెలగపిండి పేరుతో అమ్ముతారు. దీంతో కూర వండుకుని తింటారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ కూర చాలా బలవర్థకమైనది. నువ్వుల గింజలలో ఉండే ఖనిజాలు రక్తప్రవాహంలో చేరే అధిక ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.