Devotional

స్త్రీ, పురుషుల్లో కెంపు ఎవరు ధరిస్తే మంచిదో తెలుసా ?

Ruby stone Benefits In telugu : జాతకాలు, గ్రహదోషాలు పరిహారం కోసం అభిషేకాలు, దానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రకరకాల రాళ్లను ధరిస్తూ ఉంటారు. ఫలానా రాశి వాళ్ళు ఫలానా రాయి ధరిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఇలా ధరించడం వలన ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయని అంటారు.

అయితే కీలకమైన కెంపును కూడా చాలామంది ధరించడం చూస్తాం. సంస్కృతంలో దీన్ని మాణిక్యం అని, ఆంగ్లంలో రూబీ అని అంటారు. ఈర్ష్యా ద్వేషాల బారిన పడకుండా ఉండాలంటే, కెంపు ధరిస్తే మంచిదని అంటారు. ఎరుపు వర్ణం గల కెంపు ధరిస్తే నర దిష్టి నుంచి బయట పడవచ్చని అంటారు.

జన్యు పర దోషాలు, చర్మ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కూడా కెంపు వాడడం మంచిదని అంటారు. ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా కెంపు చూస్తుందని అందుకే దీన్ని ధరించాలని అంటారు. రాత్రి వేళల్లో నీటిలో కెంపు వేసి, ఉదయం ఆ నీటిని తాగితే రక్త దోషాలు పోతాయని అంటారు. కేంపుని ఎక్కువగా మగవాళ్ళు ధరించడం ఉత్తమమని అంటారు. కీళ్ల నొప్పులు, వంట్లో వేడిని తగ్గించే గుణం దీనికి ఉందని చెబుతారు.