Healthhealth tips in telugu

Pepper And Honey:మిరియాల పొడి, తేనె కలుపుకొని తింటే ఎవరికీ తెలియని రహస్యం…అసలు నమ్మలేరు

Black pepper and honey benefits: మిరియాలు,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఒక స్పూన్ తేనెలో పావుస్పూన్ లో సగం మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి.

ఇలా తీసుకుంటే ఈ చలికాలంలో వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి తగ్గటమే కాకుండా శరీరంలో ఉన్న శ్లేష్మం కరిగిపోతుంది. గొంతులో గరగర, గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. అలాగే శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే ఎన్నో వ్యాధులకు చెక్ పెడుతుంది. సమస్య ఎక్కువగా ఉంటే రోజులో రెండు సార్లు తీసుకోవచ్చు.

తేనె లో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నుంచి బయటపడవచ్చు. అన్ని రకాల ఉదర సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో ఉండే లక్షణాలు ఒత్తిడి తగ్గటానికి సహాయపడతాయి. అంతేకాకుండా అధిక బరువు తగ్గించటానికి, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.