వెల్లుల్లి ఎక్కువగా తింటే వేడి చేస్తుందా… నిజం ఎంత ?

Garlic increase body temperature :మన పెద్ద వాళ్ళు ఈ ఆహారం తింటే వేడి చేస్తుంది. ఈ ఆహారం తింటే చలువ చేస్తుంది. అని చెప్పడం వింటూ ఉంటాం. అలా చెప్పే వాటిలో వెల్లుల్లి ఎక్కువ తింటే వేడి చేస్తుందని రాగులు తింటే చలువ చేస్తుందని చెబుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారం తగ్గించే ఆహారం ఉండవని అంటున్నారు.
Garlic Benefits in telugu
శరీర ధర్మో రెగ్యులేషన్ ప్రక్రియ మీద మనం తీసుకునే ఆహారం ఎటువంటి ప్రభావము చూపదు. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవచ్చు. కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అలర్జీ వస్తుంది. కొంతమందికి వంకాయ తింటే దద్దుర్లు వస్తాయి.

అలాగే పాలు తీసుకున్న కొంతమందికి పడదు. కొంతమందికి గోధుమపిండి పడదు. అటువంటి వారు వారి శరీర తత్వానికి ఏమి పడవు అనేది చూసుకుని ఆహారాలను తీసుకోవాలి. ఎలర్జీ ఉన్నవారు ఎలర్జీ కలిగించే ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. అంతేకాని వెల్లుల్లి తింటే వేడి చేస్తుందని భావించకూడదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి వెల్లుల్లి లిమిట్ గా తీసుకోండి. ఏదైనా అతిగా తీసుకుంటే అనర్ధమే కదా. వెల్లుల్లి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అంతేకాక చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.