Healthhealth tips in telugu

Neem Leaves:పరగడుపున రెండు ఆకులు తింటే ఆ సమస్యలు ఉండవు…ఇది నిజం

Neem Health Benefits :మనలో చాలా మంది ఉదయం లేవగానే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాం. అలా తాగకపోతే రోజు గడవదు. అలాగే రోజంతా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఉదయం కాఫీ లేదా టీ కాకుండా రెండు వేప ఆకులను నమిలితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఎన్నో ఔషధ ప్రయోజనాలు కలిగి ఉన్న వేప గురించి మనలో చాలా మందికి తెలుసు. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే తప్పని సరిగా ఉదయం పరగడుపున రెండు వేప ఆకులను తినాలి. ఇలా వేప తినడం వల్ల వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.

దంతాలు చిగుళ్లు దృఢంగా మారి దంత సమస్యలు ఏమి ఉండవు. గ్యాస్., మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఏమీ ఉండవు. వేప ఆకులను నమలడం వలన కడుపులో ఏమైనా నులి పురుగులు ఉంటే అవి నశించి కడుపు నొప్పి వంటివి రావు. కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. .

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి.చూశారుగా ఇన్ని ప్రయోజనాలు కలిగిన వేప ఆకులను ప్రతిరోజు పరగడుపున తినండి కష్టంగా ఉంటే నిదానంగా అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ వేప చెట్టును కుండీల్లో పెంచుకుంటున్నారు. కాబట్టి వేప ఆకులను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.