ఇలా చేస్తే నోటి పూత చిటికెలో మాయం అవుతుంది…ఇది నిజం

Best home remedy for Mouth Ulcers in Telugu : నోటి అల్స‌ర్లు.. నోటి పూత.. ఈ రెండు కూడా ఒకటే. ఈ సమస్యను మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. ఈ నోటి పూత కారణంగా ఆహారం తీసుకోవాలన్నా, ఏదైనా తాగాలన్న చాలా క‌ష్ట‌మవుతుంది.ఈ పుండ్లు నోటిలో పెదాల కింద, బుగ్గల భాగంలో, నాలుకపై ఇలా ప్రతీ చోట వస్తుంటాయి.
Mouth Ulcers
ఇవి ఎక్కువగా వేడి వల్లనే వస్తుంటాయి. వీటిని ఇంటి చిట్కాలతో చాలా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. తేనె నోటి పూతను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. తేనెలో ఉండే.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటి పూతను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. సమస్య ఉన్న ప్రాంతంపై తేనె రాస్తే నోటి పూతకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనం అవుతుంది.

నోటిలో పుండ్లు అయిన ప్రదేశంలో కొబ్బరి నూనె రాస్తే మంట తగ్గి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దీంతోపాటు పుండ్ల వల్ల కలిగే వాపు కూడా తగ్గుతుంది. ఎండు కొబ్బరిని తినవచ్చు. కొబ్బరి నీటిని తాగిన మంచి ప్రయోజనం ఉంటుంది. నోటి పూతను తగ్గించటంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది.

కావున మూడు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కొంచెం నీటిలో వేసి.. 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి గార్గింగ్ చేయాలి. ఇలా చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. నోటిపూతను తగ్గించడంలో ఉప్పునీరు బాగా పనిచేస్తుంది. నోటి పూతలను నయం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఉప్పునీటి పుక్కిలించడం వల్ల ఈ సమస్య తొందరగా నయమవుతుంది.