Healthhealth tips in telugu

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా డయబెటిస్ ఉన్నవారు…?

Dry Fruits Benefits In telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి ప్రతి ఒక్కరు మంచి పోషకాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. లిమిట్ తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో జీర్ణం కాని ఫైబర్ లు ఉంటాయి.

వీటి కారణంగా కడుపు నొప్పి,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే చక్కెరల కారణంగా పంటి సమస్యలు వస్తాయి. బరువు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువే. డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సల్ఫర్ డయాక్సైడ్ ని వాడతారు. దీని కారణంగా అలెర్జీలు వస్తాయి.

ఉబ్బసం సమస్యతో బాధపడేవారు డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోకుండటమే మంచిది. డ్రై ఫ్రూట్స్ లో చక్కెరలు ఎక్కువ ఉంటాయి. వీటిలో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోవటం, తగ్గిపోవటం జరుగుతాయి. అందువల్ల డయబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కాబట్టి డ్రై ఫ్రూట్స్ ని మితంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అదే అతిగా తీసుకుంటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. డ్రై ఫ్రూట్స్ లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి.