పూజలో రాగి పాత్రలను ఎందుకు వాడతారో తెలుసా ?

copper utensils Worship :మన సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగివున్నాయి. శాస్త్రీయత ఉంది. ఉదాహరణకు రాగి పాత్రలో రాత్రిళ్ళు నీళ్లు పోసి, ఉదయం సేవిస్తే ఆరోగ్య పరంగా మంచిదని, మామూలు సమయంలో కూడా రాగిపాత్రలో నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని చెబుతారు.

రాగిపాత్రలో నీరు సేవిస్తే రక్త శుద్ధి జరిగి, శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతారు. ఇక పూజా సమయంలో కూడా రాగి వస్తువులు ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా రాగిపాత్రలో నీళ్లు పోసి, ఆచమనం చేస్తారు. అయితే పురాణ పరంగా కూడా రాగికి ప్రాధాన్యత ఉందని చెబుతూ ఉంటారు. అదేమిటంటే, గుడాకేశుడు అనే రాక్షసుడు పూర్వకాలంలో ఉండేవాడట.

విష్ణువు కోసం రాగి రూపంలో గుడాకేశుడు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకి మెచ్చి, విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకు వరం వద్దని, తన శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించి నీలో ఐక్యం చేసుకోమని కోరతాడు. ఆత్మ నీలో ఐక్యం అయ్యాక తన శరీరంతో చేసిన వస్తువులను పూజకు వినియోగించాలని కోరతాడు. ఆవిధంగా పూజా సమయంలో రాగి పాత్రల వినియోగం వాడుకలోకి వచ్చాయట.