కేవలం 30 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మార్చే అద్భుతమైన టిప్

White Hair Home remedies in Telugu : తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వలన వయసు మీద పడినట్టు కనపడేట్టు చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు.

అవి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చాలా మంది ఇంటి చిట్కాలు ఏమి పనిచేస్తాయి అని అనుకుంటారు. కానీ ఇంటి చిట్కాలు చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి. అయితే వీటిని రెగ్యులర్ గా వాడవలసి ఉంటుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడి,కొబ్బరి నూనె ఒక స్పూన్, ఆముదం ఒక స్పూన్ వేసి సరిపడా నీటిని పోసి అన్నీ కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట అలా వదిలేయాలి. గంట అయ్యాక ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. అయితే తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. హెన్నా పొడి అంటే గోరింటాకు పొడి. ఇది మార్కెట్ లో దొరుకుతుంది.లేదా గోరింటాకును ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు.