Healthhealth tips in telugu

ఎర్ర అరటి పండు గురించి ఈ విషయాలు తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు…ఇది నిజం

Red Banana Benefits In telugu : బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటి పండు తింటే చాలునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు అరటి పండులో మిగిలిన అరటి పండ్ల కంటే కెలోరీలు తక్కువ. అందుకే రోజుకు ఓ అరటి పండును బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే.. ఆకలిని ఇది నియంత్రించడం ద్వారా తీసుకునే ఆహారం మోతాదును తగ్గిస్తుంది.
erra arati
దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. బరువు కూడా తగ్గిపోతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అధికం. ఇది కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు.
gas troble home remedies
ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణముంది. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చు. తద్వారా ఉపశమనం లభిస్తుంది. ఎరుపు రంగు అరటి అజీర్తి, పైల్స్, కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది.

ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుంది. ఒకప్పుడు ఎర్ర అరటి పండు అరుదుగా లభించేది, కానీ ఇప్పుడు విరివిగానే లభిస్తోంది.

శరీరాన్ని రిఫ్రెష్ చేసి, చురుకుగా ఉంచుతుంది. ఒక అరటి పండు తింటే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. నరాల బలహీనతతో బాధపడే వారు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఒక ఎర్ర అరటి పండు తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. లివర్ ఇన్ఫ్లమేషన్, యూరినరీ డిజార్డర్స్ ని నియంత్రించే శక్తి ఈ అరటి పండ్లకు ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.