ఎసిడిటి ,మలబద్ధకం ,గ్యాస్ ట్రబుల్ ని మీ దరిదాపుల్లోకి రాకుండా చేసే చిట్కా

Home remedies for gastric problem in telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటివి కూడా వచ్చేస్తాయి. గ్యాస్ సమస్యను భరించలేము. మనలో చాలా మంది కడుపులో మంటను తగ్గించేందుకు చాలా మంది లేనిపోని ట్యాబ్లెట్స్, సిరప్ప్ వాడేస్తుంటారు.
sompu
డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినవైతే పర్లేదుదానీ మందుల షాపులో అడిగేసి ఏదో ఒకటి కొనేసి ఉపయోగించడం సరికాదు. ఇంకా చెప్పాలంటే.. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు చాలానే ఉన్నాయి. మన వంటింటిలో ఉన్న వస్తువులతో చాలా సమర్ధవంతంగా గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. కాస్త శ్రద్ద పెడితే చాలు.

గ్యాస్ సమస్య ఉన్నప్పుడూ అరస్పూన్ సొంపు గింజలను నోటిలో వేసుకొని నములుతూ ఆ రసాన్ని మింగితే చాలా త్వరగా గ్యాస్ నుండి ఉపశమనం కలుగుతుంది. సొంపులోని యాంటీ అల్సర్ గుణాలు ఎసిడిటీ సమస్యకు తక్షణ ఉపశమనం చూపిస్తుంది. అన్నం తిన్న వెంటనే కొన్ని సొంపు గింజలను నమిలితే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.

ధనియాలు కడుపులో యాసిడ్ నియంత్రణకు చాలా బాగా సహాయపడతాయి. గ్లాస్ నీటిని ఒక గిన్నెలో పోసి దానిలో ఒక స్పూన్ ధనియాలను వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి ఆ నీటిని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ధనియాలను వేగించి పొడి చేసి.. ఆ పొడిని అన్నంలో కలుపుకొని తింటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ధనియాల పొడిని కూరల్లో కూడా వేసుకోవచ్చు.