ఏళ్ల తరబడి వేధిస్తున్న మంగు మచ్చలు,నల్లని మచ్చలు ఒక్క రాత్రిలో మాయం

Skin pigmentation : వయస్సు పెరిగేకొద్ది.. ముఖం మీద నల్లని లేదా గోదుమ రంగు మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చలకు సాధారణ మొటిమలు, నల్ల మచ్చలకు ఎలాంటి సంబంధం ఉండదు. వీటిని మంగు మచ్చలు లేదా నల్ల శోబి అంటారు. ఇవి ఎక్కువగా బుగ్గలు, ముక్కు ఇరువైపులా వస్తుంటాయి. భుజాలు, మెడ, వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి.
Young Look In Telugu
ఈ మచ్చలు అందంగా ఉన్న వ్యక్తులను సైతం అందహీనంగా మార్చేస్తాయి. వీటికి సాధారణ మచ్చలను తగ్గించే చిట్కాలను పాటిస్తే సరిపోదు. వీటిని తగ్గించటానికి రావి ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రావి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్టులో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాయాలి.

పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖంపై మంగు మచ్చలు, నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ .పేస్ట్ ని ఒక సారి తయారు చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని పదిహేను రోజుల వరకు వాడవచ్చు.

చర్మవ్యాధులకు రావి ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. రావి ఆకులలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రావి చెట్టు రోడ్డుకు ఇరువైపుల కనపడుతూ ఉంటాయి. లేదా పార్క్ లలో కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి రావి ఆకులను సేకరించటం కూడా సులువే, కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.