Beauty Tips

2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి.

Yellow Teeth Home Remedies In Telugu : పళ్ళు తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ఉండాలని అందరూ కోరుకుంటారు. పసుపు, గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో చాలా సులభంగా పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక,సమయం ఉంటే సరిపోతుంది.
White teeth tips
ఒక బౌల్ లో 4 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల బేకింగ్ సోడా, 3 స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో రెండు నిమిషాల పాటు మీ దంతాలను సున్నితంగా బ్రష్ చేయండి. ఆ తర్వాత ఒక టీస్పూన్ కరిగించిన కొబ్బరి నూనెను మీ నోటిలో పోసుకొని ఒక నిమిషం ఉంచి పుక్కిలించండి. తరువాత దాన్ని ఉమ్మివేయండి.

ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా పసుపు రంగులోకి మారిన, గార పట్టిన పళ్ళు తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతాయి. ఈ పేస్ట్ నోటి చుట్టూ ఉన్న చర్మం యొక్క రంగు మార్చే అవకాశం ఉంది, కాబట్టి దానితో పళ్ళు తోముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

పసుపులో ఉండే యాంటీ-ఇంఫ్లామేటరీ, క్రిమినాశక మరియు యాంటీబయాటిక్ లక్షణాలు,కర్కుమిన్ అనేవి సెన్సిటివ్ దంతాలు, చిగురువాపు వంటి దంత సమస్యలను తగ్గిస్తుంది. బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనె పళ్ల మీద మరకలను తొలగించటానికి సహాయపడుతుంది. అంతేకాక కొబ్బరి నూనె బ్యాక్టీరియాను బయటకు పంపి పంటి నొప్పి, నోటి దుర్వాసన, పళ్ళ సెన్సిటివిటీ మరియు చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలను తగ్గిస్తుంది.