వెల్లుల్లితో ఇలా చేస్తే నడుం నొప్పి, వెన్నునొప్పి వంటి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి

Back Pain home Remedieis In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవన శైలి కారణంగా మనలో చాలా మంది నడుం నొప్పి, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పులు ఉన్నప్పుడు కూర్చోలేరు.. నడవలేరు.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నడుం నొప్పి తగ్గడానికి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
garlic
దీనిలో అల్లిసిన్ ఉండటం వలన పెయిన్ కిల్లర్ గా పనిచేసి నడుం నొప్పి, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. ఉదయం సమయంలో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున అస్సలు తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు. వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో గంటసేపు నానబెట్టి తినవచ్చు.

అలా కాకుండా వెల్లుల్లిని రసంగా తీసి గోరువెచ్చని ఒక గ్లాసు పాలలో కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తో పాటు అల్లం కూడా నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు అల్లం టీ తాగవచ్చు. లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక అంగుళం అల్లం దంచి వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., అర స్పూన్ తేనె కలిపి తాగవచ్చు.

ఈ రెండింటిలో మీకు లభ్యం అయిన దాన్నిబట్టి వెల్లుల్లి లేదా అల్లం రోజు తీసుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా పట్టేసిన కండరాలకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతి రోజు వ్యాయామం లేదా యోగ క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే నడుం నొప్పి., వెన్ను నొప్పి లాంటి నొప్పులన్నీ సులభంగా తగ్గుతాయి.