రాత్రి సమయంలో ఈ పేస్ట్ రాస్తే ముఖంపై మొటిమలు,మచ్చలు,గుంటలు అన్ని పోతాయి

Besan Face Glow Tips : ముఖంపై మొటిమలు (Acne) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని గిల్లకూడదు. ముఖం మీద మొటిమలు, మచ్చలు,గుంటలు తగ్గటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి,పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని రాత్రి సమయంలో ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 10 రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు,గుంటలు కూడా తగ్గుతాయి.

శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. చర్మంపై మృత కణాలను తొలగించటమే కాకుండా ముఖంపై ఉన్న అదనపు జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది. ఇక పసుపు విషయానికి వస్తే పసుపులో ఉన్న లక్షణాలు మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

శనగపిండి,రోజ్ వాటర్, పసుపు అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. కాస్త సమయాన్ని,శ్రద్దను పెడితే చాలా తక్కువ ఖర్చుతో ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాకు ఉపయోగించిన అన్ని వస్తువులు ఇంటిలో అందుబాటులో ఉందేవే. కాబట్టి ప్రయత్నం చేయండి.