2 నిమిషాల్లో గొంతు గరగర దగ్గు,జలుబు,గొంతునొప్పి అన్ని పూర్తిగా తగ్గిపోతాయి

cough and cold home remedies : గొంతులో గరగర ఉంటే వెంటనే మనం విక్స్ వేసుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల సమస్య తగ్గదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే గొంతులో గర గర, గొంతు నొప్పి,గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు పూర్తిగా తగ్గిపోతాయి. దీనికోసం ఒక టీ తయారు చేసుకోవాలి. టీ తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
Biryani leaves health benefits In Telugu
పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 5 స్పూన్ల పంచదార వేయాలి. పంచదారను బాగా కలుపుతూ ఉంటే కరిగి క్యారమెల్ అవుతుంది. దీనిలో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బిర్యానీ ఆకులు జలుబు దగ్గు కఫం తగ్గించడానికి సహాయపడుతాయి .

ఆ తర్వాత పది మిరియాలు, పది లవంగాలు, పది తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి. ఈ నీటిని నిల్వ చేసుకోవచ్చు. మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ డ్రింక్ ఎలా తీసుకోవాలో చూద్దాం.

పెద్ద వారైతే 2 స్పూన్స్, చిన్న వారైతే ఒక స్పూను తీసుకోవాలి. ఉదయం.సమయంలో ఒకసారి, సాయంత్రం సమయంలో ఒకసారి మూడు రోజులపాటు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గి గొంతులో ఉన్న కఫము కరిగి దగ్గు,జలుబు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.