80వ దశకంలో సినిమా బడ్జెట్లు,స్టార్స్ రెమ్యునరేషన్స్

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు 70నుంచి 100కోట్లు పెట్టాల్సి వస్తోంది. కొన్ని సినిమాలకు 200నుంచి 400కోట్లు కూడా అయిపోతోంది. ఇక స్టార్స్ రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంటోంది. ఒకప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా వ్యత్సాసం వచ్చేసింది.

1990నుంచి బడ్జెట్ లు పెరుగుతూ వచ్చాయి. అయితే 1980లలో చూస్తే ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు టాప్ హీరోలుగా ఉండేవారు. చిరంజీవి,సుమన్ తదితరులు అప్ కమింగ్ స్టార్స్ గా ఉండేవారు. ఎన్టీఆర్ తో మూవీ అంటే దాదాపు 40లక్షల రూపాయల బడ్జెట్ లెక్క గట్టేవారు. ఎందుకంటే కమర్షియల్ గా బోల్డన్ని హంగులు అద్దేవారు. ఎన్టీఆర్ కి 12లక్షలు పారితోషికం ఇచ్చేవారట. అప్పట్లో సౌత్ ఇండియాలో ఇది హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పేవారు.

ఇక అక్కినేని సినిమాకు అయితే హంగులు తక్కువే కనుక 30లక్షల బడ్జెట్ ఉండేది. అక్కినేని కి 10లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కృష్ణ,శోభన్ బాబు ల బడ్జెట్ 25నుంచి 30లక్షలు ఉండేది. వీరిద్దరూ ఏడేసి లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవారు. అయితే కృష్ణ బడ్జెట్ కూడా భారీగా పెంచడం,రెమ్యునరేషన్ కూడా పోటాపోటీగా ఉండడం జరిగేది.