పాలల్లో ఒక స్పూన్ కలిపి తాగితే నరాల బలహీనత,నీరసం,అలసట,నిసత్తువ లేకుండా బలంగా,చురుకుగా ఉంటారు
Wal Nuts In telugu : మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు చిన్నగా ఉంటే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. చిన్న .చిన్న పనులు చేసిన అలసట నిస్సత్తువ రావడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం, రక్త ప్రసరణబాగా జరగడానికి, చురుకుగా ఉండటానికి ఇప్పుడు చెప్పే పాలు చాలా బాగా సహాయపడతాయి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 కిస్ మిస్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగాక పటిక బెల్లం ముక్కలు వెయ్యాలి. ఈ పాలను గ్లాసులో పోసుకుని తాగాలి.
ఈ పాలను తాగడం వలన తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. పిల్లలకు ఈ .పాలను ఇస్తే మెదడు పనితీరు మెరుగు పరచి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. పిల్లలు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
ఈ పాలను వారంలో 2 సార్లు తాగితే నరాలలో బలహీనత తగ్గుతుంది. నీరసం,నిసత్తువ, అలసట తగ్గి రోజంతా హుషారుగా ఉంటారు. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. వాల్ నట్స్, కిస్ మిస్ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ పాలను తయారుచేసుకొని తాగితే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.