Healthhealth tips in telugu

Platelet count:రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పెరగాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి… మీరు తింటున్నారా

Increase platelet count In Telugu : ప్రస్తుతం ఉన్న ఈ కరోనా కాలంలో ఏ రోజు ఏమి జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ టెన్షన్ తో కాలం గడుపుతున్నారు కరోనా కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు రావడం, గుండె జబ్బులు రావటం, కిడ్నీ సమస్యలు రావడం వంటి వాటిని పక్కనపెడితే చాలామందికి రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి.

హై ఫీవర్ వచ్చిన డెంగ్యూ మలేరియా వంటివి వచ్చినా ముందుగా రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతుంది. ఇలా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా పెంచుకోవటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. బొప్పాయి పండు అలాగే బొప్పాయి ఆకు ను తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది.

తగ్గిన వారికి పెరుగుతుంది. బొప్పాయి ఆకులను జ్యూస్ గా తయారు చేసి తీసుకోవాలి ఇలా ప్రతి రోజూ తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది
గుమ్మడి కాయను జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు. గుమ్మడికాయ మెత్తని పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి దానిలో కొంచెం తేనె కలుపుకుని తాగాలి.

గోధుమ గడ్డి జ్యూస్ తాగిన ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగండి. దానిమ్మ పండు గింజలు తిన్న రక్తం వృద్ధి చెందుతుంది అలాగే ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం కష్టంగా ఉంటే జ్యూస్ చేసుకుని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.