Devotional

కాకికి అన్నం పెట్టడంలో ఉద్దేశ్యం ఏమిటో తెలుసా ?

why feed the crow : ఈ సృష్టిలో సకల జీవరాశులు ఆనందంగా జీవించాలన్నదే మన భారతీయ ధర్మం. అందుకే ముక్కోటి దేవతలకు మొక్కడం, పశు పక్ష్యాదులకు ఆహరం, నీరు అందించడం చేస్తూ ఉంటారు. అయితే చాలామంది కాకికి ఆహరం ముఖ్యంగా అన్నం పెట్టడం ఒక ఆనవాయితీగా పాటిస్తుంటారు. తమిళనాడులో అయితే అన్నం తినేముందు కాకులకు ముందుగా అన్నం పెట్టడం ఇప్పటికీ ఆచరిస్తుంటారు.

పితృదేవతలను తలచుకుని ప్రతిరోజూ కాకులకు అన్నం అందిస్తే, కర్మ ఫలాల్లో దోషాలు తొలగిపోయి, మంచి జరుగుతుందని పండితుల ఉవాచ. ఇక కాకిని మన పూర్వికులు శనిదేవుడుగా భావించి శనిగ్రహ నివారణ కోసం కాకులకు అన్నం పెట్టేవారని మరో వాదన కూడా ఉంది.

ప్రతి శనివారం నవగ్రహాలయానికి వెళ్లి శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అప్పుడు కాకులకు అన్నం పెడితే శనిగ్రహ దోషం నివారణ అవుతుందని కూడా చెబుతూ ఉంటారు. పైగా మన ఇళ్ల చుట్టూ కొన్ని రకాల జీవులు చనిపోతే వాటిని శుభ్రం చేయడంలో కాకులు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే కాకులకు అన్నం పెట్టడం ద్వారా మన ఇంటి చుట్టూ కాకులు తిరిగేలా శాస్త్రీయ దృక్కోణం కూడా ఇందులో ఉందట.