కేవలం అరస్పూన్ చాలు-అధిక బరువు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వు,డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్ అనేవి ఉండవు

Mentulu Benefits : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అవి ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. మెంతులు, వాము, నల్ల జీలకర్ర ఈ మూడింటినీ కలిపి తీసుకుంటే శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Ajwain Health Benefits In Telugu
రోగనిరోధక శక్తిని పెంచడానికి అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక పాన్ లో రెండు స్పూన్ల మెంతులు, రెండు స్పూన్ల వాము, రెండు స్పూన్ల నల్ల జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ గా తయారు చేసుకుని నిల్వచేసుకోవాలి.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగితే శరీరంలో విషాలు అన్ని తొలగిపోతాయి. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆకలి లేని వారికి ఆకలి పెంచుతుంది. ఈ పొడి శోధ నిరోధక ఏజెంట్ గా పనిచేసి కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి యాంటీ డయాబెటిక్ గా పనిచేసి డయాబెటిస్ అదుపులో ఉండేలా చేస్తుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో జీవక్రియ రేటును పెంచి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు.ను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా జీలకర్రలో ఉండే కాల్షియం సహాయపడుతుంది. అధిక బరువు సమస్య, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మంటను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.