ఈ సమస్యలతో ఉన్నవారు బొప్పాయి తింటే ఏమి జరుగుతుందో తెలుసా?

Papaya Benefits : పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది.ఇది చాలా లాభదాయకమైన ఫలం.విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయి మంచి మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్, న్యూట్రింట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది.ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Benefits of papaya seeds
దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు.కాని ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు తెలుసా ? ఆ కొందరు ఎవరు ? ఎలాంటి కండీషన్స్ లో బొప్పాయి తినకూడదో చూడండి. ఆస్తమ, హే ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే.ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజీం ఉంటుంది.
papaya Leaf Health Benefits In Telugu
ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది.సమస్యలు ఇంకా పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే.కాని మరీ తక్కువగా ఉండటం మంచిది కాదు.బొప్పాయి షుగర్ లెవల్స్ పడిపోయేలా చేస్తుంది నిజమే కాని ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ మరీ టూ మచ్ గా పడిపోవచ్చు.కొందరు తక్కువ షుగర్ లెవల్స్ తో ఇబ్బంది పడుతుంటారు.

అలాంటివారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి.చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిదే.బీటా కెరోటిన్ ఉండటం వలన ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది కూడా.కాని అతిగా తింటేనే ప్రమాదం.ఇది తెల్ల, పసుపు మచ్చలకి కారణం అవుతుంది.ఇప్పటికే ఈ సమస్య ఉంటే అస్సలు బొప్పాయిని ముట్టుకోవద్దు.బొప్పాయి లిమిట్ లో తీసుకుంటేనే మంచిది.

గర్భిని స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు.ఎందుకంటే దీంట్లో లటేక్స్ ఉంటుంది.ఈ ఎలిమెంట్ యుతెరైన్ కాంట్రాక్షన్ కి కారణం అవుతుంది. దీని వలన కడుపులో బిడ్డకి ప్రమాదం.ఒక్కోసారి అబార్షన్ చేయాల్సి రావొచ్చు.కాబట్టి అతిగా తినవద్దు. ఎక్కువగా విటమిన్ సి ఉండటం వలన బొప్పాయి మంచిది.కాని ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే రెనాల్ స్టోన్స్ సమస్య వస్తుంది.అలాగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.ఈ రిస్క్ ఉన్నవారు బొప్పాయిని లిమిట్ గా తినాలి.